రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న చేవెళ్ల బీజేపి పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చేవెళ్ల పార్లమెంట్ లో బీజేపి సైన్యం సిద్దంగా ఉన్నది. దేశంలో మోడీ హవా నడుస్తుంది చేవెళ్ల నియోజకవర్గం లో ఒకసారి క్యాంపెను కూడా నిర్వహించడం జరిగింది ప్రతి గ్రామానికి మండలానికి ప్రధానమంత్రి పథకాలు అందరికీ అందుతున్నాయి. కాబట్టి ఈసారి కూడా ప్రతి ఒక్కరు మోడీకి ఓటు వేసి 400 ఎంపీ సీట్లను గెలిపించాలని కోరుకుంటున్నాము. పార్టీని మోసేది కూడా బూత్ లెవెల్ అధ్యక్షులు మరియు మా కార్యకర్తలే కాబట్టి అందరం కష్టపడి సమిష్టిగా పోరాడి చేవెళ్లలో గెలవబోతున్నామనీ ఇది ప్రిపరేషన్ మీటింగ్ కాబట్టి మన అందరం కలిసి మన యొక్క బాధ్యతలు మరవకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కానీ గ్రామస్థాయి బూత్ లెవెల్ కార్యకర్తలే పార్టీ జెండాను మోస్తారు. మా పార్టీకి కార్యకర్తలే బలము అవతల పార్టీ వాళ్లకు కాండేట్ లేక తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో బిజెపి పార్టీ 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాము అని ధీమా వ్యక్తం చేశారు
చేవెళ్ల పార్లమెంట్ లో బీజేపీ సైన్యం సిద్ధంగా ఉంది…
96
previous post