విష్ణు దియో సాయిని సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ

Vishnu Deo Sai as CM

Advertisements

&NewLine;<p>ఛత్తీస్‌గఢ్‌లోని ప్రముఖ గిరిజన నేత విష్ణు దియో సాయిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది&period; 54 మంది ఎమ్మెల్యేలతో జరిగిన పార్టీ శాసనసభా పక్ష నేతలసమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు&period; రాష్ట్రానికి ఓ గిరిజన నేతను సీఎం చేయాలన్న మోదీ సంకల్పం ప్రకారం సీఎం ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి&period; వివాదరహితుడిగా పేరున్న విష్ణుదియో సాయి&comma; నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు&period; 2020-22 మధ్యకాలంలో రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్‌గా సేవలందించారు&period; పార్టీ నిర్వహణపై మంచి పట్టున్న వ్యక్తిగా పేరుపొందారు&period; బీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేసిన ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జూనియర్ మినిస్టర్‌గా నియమించారు&period; విష్ణు దియో సాయిను సీఎం చేసే అవకాశం ఉందని ఎన్నికల సమయంలోనే హోం మంత్రి అమిత్ à°·à°¾ సంకేతాలిచ్చారు&period; కుంకురి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా అమిత్ à°·à°¾ మాట్లాడుతూ మీరు సాయిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మేము ఆయనను ఇంకా పెద్ద వ్యక్తిని చేస్తాం అని వ్యాఖ్యానించారు&period; ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనులకు బీజేపీ ఫేవరెట్‌గా మారింది&period; మునుపెన్నడూ చూడని రీతిలో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న సుర్గుజా ప్రాంతంలో ఉన్న 14 సీట్లు&comma; బస్తర్ ప్రాంతంలోని 12 సీట్లు గెలుచుకుంది&period; దీంతో&comma; విష్ణు దియో సాయికి సీఎం కుర్చీ దక్కింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!