78
తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్, సినీ నటి మహేశ్వరీలు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన జాహ్నవీ కపూర్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.