ఎమ్మెల్సీ కవితది అక్రమ అరెస్టంటూ, నిరసనగా దేవరకొండలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా… ధర్నాలో పాల్గొన్న నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్… ధర్నాలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలకు మధ్య తోపులాట. రవీంద్ర కుమార్ ను అరెస్టు చేయకుండా అడ్డుకున్న కార్యకర్తలు.. అయినా బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎమ్మెల్సీ కవితది అక్రమ అరెస్టంటూ నిరసిస్తూ BRS నాయకులు దేవరకొండలో ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. అనంతరం రవీంద్ర కుమార్ ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులకు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాయకులను స్టేషన్ కు తరలించే క్రమంలో కార్యకర్తలు పోలీసు జీపుకు అడ్డుపడగా పోలీసులు బలవంతంగా రవీంద్ర కుమార్ ను, నాయకులను, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి