లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా టీడీపీ, జనసేన (TDP, Janasena) నేతలు
కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా టీడీపీ, జనసేన నేతలు (TDP, Janasena) ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మునిరత్నం పాల్గొన్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మునిరత్నం, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొత్తపేటలో చంద్రబాబుకు ప్రతి ఎన్నికల్లో చంద్రబాబుకు భారీ మెజారిటీ వస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కొత్తపేటలోని 5 బూత్ లలో చంద్రబాబుకు మరింత మెజారిటీ వస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కుప్పం సమన్వయకర్త నరేష్, మరియు టీడీపీ నేతలు ముఖేష్, రాజ్ కుమార్, మరియు టీడీపీ, జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: పసికందును కన్నతల్లి ఏం చేసిందంటే..?
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి