Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయి దాడినీ (Attack on Jagan) నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి క్లాక్ టవర్ నుండి క్యాండిల్ ర్యాలీ (Candle rally) నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసిపికి వస్తున్న ప్రజాదారనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కార్యకర్తలను రెచ్చగొట్టి ముఖ్యమంత్రి పై దాడి కి పురిగొలిపారని మోహిత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. గత రెండు వారాల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి కార్యకర్తలకు కిరాయి రౌడీలను దాడులు చేయమని ప్రోత్సహించారని గుర్తు చేశారు. పక్కా పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జగన్ పై దాడి జరిగిందని దీనిపై వెంటనే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్తారన్నారు. వైసిపికి సింపతి అవసరంలేదని, జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఉండటం వల్లే ప్రతిపక్షాలు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.