63
రామగుండం ఏరియా సింగరేణి బొగ్గుగనుల పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ విజయం సాదించిన సందర్బంగా కాంగ్రెస్ అనుబంధ ఐ ఎన్ టి యు సి కార్యకర్తలు బొగ్గు గనులపై సంబరాలు చేసుకున్నారు.
రామగుండం రీజియన్ జిడికే 2వ బొగ్గుగని పై టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పెంచాల. తిరుపతి మాట్లాడుతూ గత పాలకులు సింగరేణి నిధులను ఇతర ప్రాంతాలకు తరలించి రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా చేసారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కార్మికుల హక్కుల పరిరక్షణ తో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. రామగుండం ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపుకు సహకరించిన కార్మికుల ఈసందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.