సింగరేణిలో భారీ వర్షాల కారణంగా ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలలో గత ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టు క్వారీ లలోని పని స్థలాలలో వర్షం నీరు నిల్వ ఉండడంతో ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయి. భారీ యంత్రాలు సైతం మూలకు పడ్డాయి. ప్రాజెక్టులలో ఎక్కడికక్కడ బురద కావడంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఉద్యోగులు సైతం ఖాళీగా ఉండే పరిస్థితి నెలకొంది. సింగరేణి వ్యాప్తంగా 23 భూగర్భ గనులు, 19 ఉపరితల ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. అందులో భూగర్భ గనుల నుంచి 20శాతం, ఉపరితల గనుల నుంచి 80 శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు 1.74 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది.
ఇటీవల వర్షాలతో ఉత్పత్తికి అంతరాయంతో పాటు వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తున్న బొగ్గు రవాణా కూడా స్తంభించిపోయింది. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో 1 లక్ష 46 వేల 595 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గితేనే తిరిగి యధావిధిగా ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి