60
ఆంధ్రప్రదేశ్ లో మిచాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మిచాంగ్ తుఫాన్ నష్టం నుంచి కోలుకోకముందే ఏపీకి మరో తుఫాన్ రూపంలో ముప్పు పొంచి ఉంది. డిసెంబర్ 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం డిసెంబర్ 18న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 21 నుంచి 25 తేదీ వరకు ఐదురోజులపాటు ఏపీలో వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దీని గమనం శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతోందని తెలిపారు. ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా మారే అవకాశం ఉండటంతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు వర్షాలు పడవచ్చని అధికారులు చెబుతున్నారు.