Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home International హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ టాప్

హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ టాప్

by Satya
Human Trafficking

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా వివరాల ప్రకారం అత్యధిక మానవ అక్రమ రవాణా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది.
గతేడాది దేశవ్యాప్తంగా 2250 కేసులు నమోదు కాగా 391 కేసులు తెలంగాణలో వెలుగు చూశాయి. 25 మంది బాలికలు, 9 మంది మంది బంగ్లాదేశ్ యువతులు, 641 మంది మహిళలు, 38 మంది బాలురుతో సహా మొత్తం 704 మందిని రాష్ట్ర పోలీసులు కాపాడారు. బాధితుల్లో కొందరిని రెస్క్యూ హోమ్స్‌కు బాలకార్మికులను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మరికొందరిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు. 600 మందికి పైగా మహిళలు, 100 మంది చిన్నారులకు మెట్రో నగరాలకు అక్రమంగా తరలించినట్టు ఎన్సీబీ నివేదిక చెబుతోంది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో పాటూ ఇతర రాష్ట్రాల యువతులు, మైనర్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తెలంగాణలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందాలు క్రియాశీలకంగా ఉండటంతో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగం, ఉపాధి, ప్రేమ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తెలంగాణకు రప్పిస్తున్నారు. చివరకు వ్యభిచార కూపాల్లో దించుతున్నారు. బీహార్, యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాలకార్మికుల అక్రమ రవాణా సాగుతోంది. రాష్ట్రంలో మానవ అక్రమరవాణాకు చెక్ పెట్టేందుకు 30 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. కేంద్రం గైడ్‌లైన్స్ ప్రకారం సీఐడీ పోలీసులు, స్వచ్చంధ సంస్థలు, చైల్డ్ ప్రొటెక్షన్, లోకల్ పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరుతో ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039849
Total views : 201020

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: