“రా.. కదలిరా!” పేరిట చంద్రబాబు భారీ బహిరంగ సభలు

chandra babu "raa..kadhali raa" meetings

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా&comma; టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన&period; బొబ్బిలి వేదికగా బహిరంగ సభ&period; తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం కనిపిస్తోంది&period; టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాకు రానున్నారు&period; బొబ్బిలిలోని రాజా కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు&period; ఇందుకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు&period; తెలుగు తమ్ముళ్లను భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు సన్నాహాలు చేశారు&period; ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు&period; ఎన్నికల వాతావరణం దగ్గరపడడంతో ప్రచారం ముమ్మరం చేయనున్నారు&period; ఇందులో భాగంగానే &&num;8216&semi;à°°à°¾… కదిలి à°°à°¾&&num;8217&semi; అనే కార్యక్రమంలో భాగంగా అధినేత చంద్రబాబు మరోసారి జిల్లాకు వస్తున్నారు&period; ఇటీవలే భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల శంఖారావం పూరించారు&period; ఈసారి బొబ్బిలి వేదికగా విజయనగరం &&num;8211&semi; పార్వతీపురం మన్యం జిల్లాల కేడర్‌కు బాబు దిశానిర్థేశం చేయనున్నారు&period; బొబ్బిలి కేంద్రం ఈ రెండు జిల్లాలకు సమాంతర దూరంలోనూ&comma; పార్టీకి కాస్త బలమైన నియోజకవర్గంగాను గుర్తించిన పార్టీ ఇక్కడ సభ నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా టిడిపి నాయకులు చెబుతున్నారు&period; బాబు వరుస పర్యటనలతో టిడిపి నాయకులు&comma; కార్యకర్తలు&comma; అభిమానుల్లో జోష్‌ కనిపిస్తోంది&period; విజయనగరం&comma; బొబ్బిలి&comma; రాజాం&comma; చీపురుపల్లి నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది&period; గజపతినగరం&comma; నెల్లిమర్ల&comma; ఎస్‌&period;కోట నియోజకవర్గాల టికెట్ల పై కూడా కసరత్తు ముమ్మరం చేశారు&period; ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు&period; బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో బాబు దృష్టిలో పడేందుకు కూడా తహతహలాడుతున్నారు&period; గత నెల 20à°¨ పోలిపల్లి బహిరంగ సభ మాదిరిగానే దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు&period; నేడు జరగనున్న బహిరంగ సభల్లో కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడం&comma; వైసిపిలోనూ&comma; ప్రభుత్వంలోనూ లోపాలను&comma; వైసిపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను&comma; అమలుకాని హామీలను ఎత్తి చూపడమే బాబు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బుధవారం ఉదయం 10&period;15గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో బయలుదేరి&comma; 11గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు&period; అక్కడి నుంచి బొబ్బిలి రాజా కాలేజీ మైదానానికి 11&period;40గంటలకు చేరుకుంటారు&period; 12గంటలకు సభ ప్రారంభమై 1&period;30గంటలకు ముగుస్తుంది&period; అనంతరం 2&period;30గంటలకు తిరుగు ప్రయాణమవుతారు&period; మిగిలిన గంట వ్యవధిలో పార్టీ కీలక నాయకులు&comma; కార్యకర్తలతో జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది&period; బహిరంగ సభ ఏర్పాట్లును మంగళవారం టిడిపి నాయకులు కిమిడి కళా వెంకటరావు&comma; మాజీ మంత్రి సుజరుకృష్ణరంగారావు&comma; నియోజకవర్గ ఇన్‌చార్జి బేబినాయన&comma; కూన రవికుమార్‌ తదితరులు పరిశీలించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.