86
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం వేదిక, సమయం ఖరారు చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.