119
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 29వ తేదీ న బనగానపల్లెలో పర్యటన చెయనున్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు చేయబోతున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు కొనసాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి వరుసగా పర్యటనలను ఆయన చేయనున్నారు. అందులో భాగంగా ఈ నెల 29వ తేదీ బనగానపల్లెలో పెట్రోల్ బంక్ కూడలి వద్ద ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు పర్యటనకు సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి బనగానపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.