49
తెలంగాణలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రజా సానుకూల పాలన అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఆయన ఖమ్మం జల్లా నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ అనుసరించిన అహంకార వైఖరి కారణంగానే ఓటమి పాలయ్యారన్నారు. కేసిఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ప్రజలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపించిందని అన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావంతో ఫలితాలు తారు మారయ్యాయని అన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.