97
హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభ ఎన్నికల చిచ్చు రేగిన నేపథ్యంలో సీఎం రాజీనామా చర్చనీయాంశంగా మారింది. ఉదయం మంత్రి పదవికి విక్రమాదిత్య రాజీనామా చేయగా.. తాజాగా సీఎం సుఖ్వీందర్సింగ్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపారు. దీంతో మరో సీఎం అభ్యర్థిని వెతికే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్. పరిశీలనలో ముగ్గురు పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఉదయం అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు.