రాష్ట్ర ప్రజలు వన్స్ మోర్ జగనన్న అంటున్నారని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohith Reddy) ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయితీ పరిధిలో మన ఊరికి మన మోహిత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు భారీగా పాల్గొన్నారు. తిరుమల నగర్ పంచాయితికి ఐదేళ్ల లో 7కోట్ల తో అభివృద్ధి చేశాం అని స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు వారి ఖాతాల్లో రెండు నుంచి నాలుగు లక్షలు రూపాయలు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అందించామని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గతంలో కన్నా చంద్రగిరి నియోజకవర్గం (Chandragiri Constituency)లో భారీ ఆధిక్యం తో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 24న నామినేషన్ వేయనున్నట్లు తెలిపిన మోహిత్ రెడ్డి, ప్రతి సర్వేలు వైసీపీ కి అనుకూలంగా చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి