68
ఏసుక్రీస్తు సందేశం ప్రపంచ మానవాళికి ఆదర్శమని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం మాచర్ల పట్టణంలోని నరిసిటీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ తోటి వారితో ప్రేమ దయతో కలిగి ఉండాలని క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరూ ఆచరిస్తే కల్మషాలు విభేదాలు లేని సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, దైవజనులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.