రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) :
టీడీపీ నేత రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) పోటీపై స్పష్టత వచ్చింది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్ఠానం తనను ఆదేశించిందని ఆయన ప్రకటించారు. పార్టీ బీఫాం అందుకుంటానని, ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన వెల్లడించారు. ఉండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తానని రఘురామకృష్ణరాజు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దీంతో ఉండి నియోజకవర్గ టీడీపీ బీఫామ్‌ను ఆయన అందుకోనున్నారు. కాగా నరసాపురం ఎంపీగా ఉన్న రఘు రామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారంటూ వార్తలు వెలువడ్డాయి. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…