కోటచంబగిరి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి బుధవారం జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టును పార్టీలకు అతీతంగా గ్రామస్థులందరూ కలిసి నిర్వహిస్తే, వైసీపీకి చెందిన కొంతమంది పార్టీకి సంబంధించిన బ్యానర్లను ఏర్పాటు చేశారు. బ్యానర్లను ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు గ్రామస్తులు వైసీపీకి చెందిన వారిని అడిగారు. కాగా జల్లికట్టును మేమే నిర్వహిస్తున్నామని వైసిపికి చెందిన పలువురు గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. నగేష్, మరియు మురగ రాజ్ పై వాలంటీర్ సోకమ్మ భర్త సొము, వైసిపికి చెందిన సంజయ్, నవీన్, రాజేంద్ర లు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో నగేష్, మురుగరాజుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కావాలనే తమపై వైసీపీకి చెందినవారు దాడి చేశారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని నగేష్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
కోట కంబగిరి గ్రామంలో జల్లికట్టు నిర్వహణ లో ఘర్షణ…
79
previous post