స్వచ్ఛత గ్రామాల పేరిట చేపట్టిన కార్యక్రమాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో చెత్త సంపద కార్యక్రమాలు నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారం తో గత ప్రభుత్వం చెత్త సంపద తయారీ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తసంపద కేంద్రాలను పట్టించుకోవడం లేదు. దీంతో లక్షల రూపాయల వ్యయంతో నెలకొల్పిన కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. చెత్త సేకరణ కోసం పంచాయతీకి రెండేసి రిక్షాలు చొప్పున అందించారు, కానీ ఆ రిక్షాలు మూలన పడ్డాయి. సేకరించిన తడి- పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని లక్ష్యంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో ఈ కేంద్రాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. ఇప్పటికైనా ఈ చెత్త సేకరణ కేంద్రాలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
మూన్నాళ్ల ముచ్చటగా మారిన స్వచ్ఛత కార్యక్రమాలు..
88