మేడారం జాతరకు సీఎం రేవంత్ రెడ్డి…

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ కుంభమేళా&comma; మేడారం జాతరను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు&period; సీఎంకు మంత్రి సీతక్క&comma; అధికారులు స్వాగతం పలికారు&period; సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి అమ్మవార్లను దర్శించుకున్నారు&period; అమ్మవార్లకు రేవంత్ రెడ్డి నిలివెత్తు బంగారం సమర్పించారు&period; ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క&comma; కొండా సురేఖ&comma; పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&comma; శ్రీధర్ బాబు&comma; సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు&period; మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న అనంతరం ఆరు గ్యారెంటీల అమలు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఫిబ్రవరి 27న రూ&period; 500కే గ్యాస్&comma; 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని చెప్పారు&period; పథకం అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు&period; గతంలో కేసీఆర్ దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారని అన్నారు&period; జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు&period; దక్షిణాది కుంభమేళాకు కేంద్రం ఇచ్చేది రూ&period; 3 కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించారు&period; ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్న ఇక్కడి నుంచే మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు&period; హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు&period; సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు&period; యాత్ర సమయంలో ఎలాంటి ఆకంటం లేకుండా జాతర జర్పిస్తామని మాట ఇచ్చామని మాట ప్రకారం జాతర కోసం రూ&period; 110 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.