60
హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్ కట్టలేదని 15మంది విద్యార్థులను ఎగ్జామ్ కు అనుమతించలేదని ఆ కాలేజీ సిబ్బందిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎగ్జామ్ ఫీజ్ విషయంలో సమాచారం లేదని, ఇప్పుడు ఫీజ్ కడతామని ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు కోరారు. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వలేమని చెప్పడంతో ఎగ్జామ్ ను బహిష్కరించి, తోటి విద్యార్థుల 15 మందికి ఎగ్జామ్ రాయడానికి అనుమతిస్తేనే తాము సైతం ఎగ్జామ్ రాస్తామని కాలేజీ ఆవరణలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.