ఐటి సోదాల కలకలం..

IT Officials search

Advertisements

&NewLine;<p>నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుమారు మూడు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు&period; తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు జిల్లాలో సోదాలు నిర్వహించారు&period; ఒకరు విశ్రాంత ప్రిన్సిపాల్ కాగా&comma; మరొకరు ప్రముఖ బంగారు వ్యాపారి తో పాటు పత్తి మిల్లు యజమాని ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేశారు&period; ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారన్న సమాచారం సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అయింది&period; ఎన్నికల వేళ ఐటి అధికారుల సోదాలు నారాయణపేట జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపాయి&period; ఇండ్లలో సోదాలు జరిపిన ముగ్గురిలో ఇద్దరు అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న వారు కావడం&comma; నారాయణపేట జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది&period; చాలా రోజుల తర్వాత జిల్లా కేంద్రంలో ఐటీ అధికారులు సోదాలు జరపడం విశేషం&period; ఇదిలా ఉండగా ఐటీ అధికారులు సోదాలు జరపడంతో జిల్లా కేంద్రానికి చెందిన మరి కొంతమంది బడా వ్యాపారులు ఉలిక్కిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..