మంచిర్యాల జిల్లా లోని మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీ లలో చైర్మెన్, వైస్ చైర్మన్ ల ఎంపిక సమావేశం అయా మున్సిపాలిటీ సమావేశ మందిరంలో నిర్వహించారు. గత నెల లో రెండు మున్సిపాలిటీ ల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా అవిశ్వాసం నెగ్గడం తో చైర్మెన్, వైస్ చైర్మన్ లు పదవులు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీల్లో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికకు సంబంధించి 11 గంటలకు ఆర్డిఓ రాములు ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా క్యాంపు నుంచి నేరుగా సమావేశ మందిరానికి కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో చైర్మన్ గా రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ గా సల్ల మహేష్ లను బలపరచగా 26 మంది సభ్యుల మెజారిటీ మద్దతుతో చైర్మెన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకున్నారు. నస్పూర్ మున్సిపాలిటీ లో చైర్మెన్ గా సురిమిళ్ళ వేణు, వైస్ ఛైర్మెన్ గా గెల్లు రజిత లను ఎన్నుకున్నారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారి రాములు చైర్మెన్, వైస్ చైర్మన్ ల చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మెన్ ఉప్పలయ్య మాట్లాడుతూ చైర్మెన్ గా ఎన్నుకున్న కౌన్సిలర్ లకు, వెన్నంటే ఉండి పోత్సహించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కేవలం ఏడాది సమయం పదవీకాలం ఉండడం తో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు పార్టీ నాయకత్వం ఆశయాల మేరకు అధికారులు, తోటి కౌన్సిలర్ల సహకారం తో మున్సిపాలిటీ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీ వద్ద కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నుంచి ఎమ్మెల్యే నివాస గృహానికి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.
95
previous post