89
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ను ఈ రోజు ఉదయం ప్రకటించింది. ఈ లిస్ట్ లో మొదటిగా YS షర్మిల కడప నుంచి బరిలో దిగుతున్నారు. మిగతా ఎంపీ అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజమండ్రి నుంచి – గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జెడి శీలం, కాకినాడ నుంచి పళ్ళం రాజు, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, విశాఖ నుంచి సత్యారెడ్డి, ఏలూరు నుంచి లావణ్య, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహిన్. ఈ ఎన్నికల్లో రఘువీరారెడ్డి పోటీకి దూరంగా ఉంటున్నట్టు తెలియజేసారు. రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్టు ఆయన తెలియజేసారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించవలసిన దానిలో 58 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్ సభ స్థానాలు పెండింగ్ ఉన్నాయి.