Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh నేడు జనసేన పార్టీలోకి చేరనున్న మండలి బుద్ధప్రసాద్

నేడు జనసేన పార్టీలోకి చేరనున్న మండలి బుద్ధప్రసాద్

by Satya
Mandali Buddhaprasad

జనసేన(Janasena)లోకి టీడీపీ నేత..

ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్(Deputy Speaker), టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్(Mandali Buddhaprasad) నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. బుద్ధప్రసాద్‌కు ఇప్పటికే అవనిగడ్డ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ స్థానం జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బుద్ధ ప్రసాద్‌ను బరిలోకి దింపాలని జనసేన అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది.

ఇది చదవండి: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత..!

1999, 2004, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బుద్ధ ప్రసాద్ కు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడం కూడా ఇందుకు మరో కారణం. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా అవనిగడ్డను తన ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తోంది. ఇక, మచిలీపట్టణం లోక్‌సభ స్థానానికి కూటమి నుంచి బరిలోకి దిగిన వల్లభనేని బాలశౌరికి జనసేన టికెట్ కేటాయించడం వెనక మండలి బుద్ధప్రసాద్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి …
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. …
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042283
Total views : 223754

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: