లోక్ సభ ఎన్నికల(Lok Sabha election) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అరగంట తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఈసీని కలిశారు. ఈ క్రమంలో, రూల్ 54A ప్రకారం అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. నిబంధనలకు అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియామావళి 1961లోని రూల్ 54ఏ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
543 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. ఇదిలా ఉండగా, మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే విపక్షాలు ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్నాయి. ఇండియా కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్ సభ సీట్లలో కూటమి ఎక్కువగా గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మాత్రం వైసీపీ ఏర్పాటు చేస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చునని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో వెలువడే ఫలితాల కోసం అందరూ వేచి చూస్తున్నారు.
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.