కుప్పకూలిన రష్యా విమానం

Crashed Russian plane

Advertisements

&NewLine;<p>ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా విమానం కుప్పకూలింది&period; అందులో 74 మంది ప్రయాణిస్తున్నారు&period; ఈ సైనిక రవాణా విమానంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు&comma; తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని రష్యా వెల్లడించింది&period; ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది&period; దీనికి గల కారణాలను గుర్తించేందుకు స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనా స్థలానికి వెళ్తోందని తెలిపింది&period; ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా&period;&period;&quest; అనేది తెలియాల్సి ఉంది&period; ప్రమాదానికి ముందు విమానం అదుపుతప్పి వేగంగా కిందికి పడిపోయింది&period; తర్వాత విమానం నివాసప్రాంతాల వద్ద నేలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ ఖైదీలను బెల్గోరాడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు&period; అయితే ఆ విమానాన్ని తమ రక్షణ బలగాలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌లోని స్థానిక మీడియా తెలిపింది&period; అందులో రష్యా క్షిపణులను తరలిస్తోందని&comma; యుద్ధ ఖైదీలను కాదని పేర్కొంది&period; కానీ రష్యా మాత్రం అందులో ఉన్నది యుద్ధ ఖైదీలేనని చెబుతుండటం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్