మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.

Advertisements

<p>గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు&period; కాజా టోల్‌గేట్ సమీపంలోని ప్రభల్ టెక్ పార్క్‌లో చోరీకి గురైన ఎలక్ట్రికల్ వైర్ల కేసును ఛేదించిన పోలీసులు మొత్తం పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు&period; భవనాల్లోని విద్యుత్ వైర్ల నుంచి కాపర్‌ను వేరు చేసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు&period; నిందితుల నుంచి 28 కేజీల కాపర్‌ను స్వాధీనం చేసుకోగా&comma; దాని విలువ సుమారు రూ&period;3 లక్షలు ఉంటుందని మంగళగిరి గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు&period; చోరీ సొత్తు అని తెలిసి కొనుగోలు చేసిన వారిపైనా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు&period; ఇలాంటి నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.