వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్

Advertisements

<p>వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు&period; గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన&comma; అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు&period; వరంగల్‌లో ఒక వ్యక్తి సజీవ పాములను అక్రమంగా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడన్న పక్కా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు రంగంలోకి దిగారు&period; కస్టమర్ల రూపంలో వెళ్లిన అధికారులు పక్కా ప్రణాళికతో డికాయ్ ఆపరేషన్ నిర్వహించి&comma; సదరు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు&period; అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా&&num;8230&semi; అంతర్జాతీయ మార్కెట్లో భారీ విలువ పలికే రెండు సజీవ &&num;8216&semi;ఇండియన్ రెడ్ శాండ్ బోవా&&num;8217&semi; లభ్యమయ్యాయి&period; వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972లోని షెడ్యూల్-I ప్రకారం ఈ జాతి పాములను ఉంచుకోవడం&comma; రవాణా చేయడం లేదా వ్యాపారం చేయడం తీవ్రమైన నేరం&period; దీంతో స్వాధీనం చేసుకున్న పాములతో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం వరంగల్ రేంజ్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..