విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

Advertisements

<p>పట్టపగలే నగర నడిబొడ్డున&period;&period; జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం రేపింది&period; ఓ అపార్ట్‌మెంట్ లోకి దూరి దారుణంగా హత్య చేశాడో దుండగుడు&period; దొంగతనానికి వచ్చి&period;&period; బంగారు నగలు దోచుకునే సమయంలో హత్య చేసిన ఘటన ఇది&period; ఇంట్లోకి చొరబడి మరీ బంగారం కోసం హత్య చేయడంతో&period;&period; ఈ ఘటన విశాఖ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది&period; ఏ క్షణానా ఎవరొచ్చి ఘాతుకానికి పాల్పడతారో అన్న టెన్షన్ పుట్టిస్తోంది&period;<br &sol;>&NewLine;విశాఖలో పట్టపగలు దుండగుడు ఒక అపార్టుమెంట్‌లో చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలను పట్టుకుపోయిన ఘటన ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది&period;<&sol;p>&NewLine;<p>కేసు దర్యాప్తులో భాగంగా అపార్టుమెంట్‌లో సీసీ కెమెరాలు పరిశీలించగా అనుమానంగా ప్రవేశించిన వ్యక్తిని గుర్తించారు&period; డాగ్ స్కాడ్‌తో గాలించగా పక్క వీధిలో ఓ గ్రూప్ హౌస్ వద్ద ఆగింది డాగ్ స్కాడ్&period; ప్రాధమిక ఆధారాలు ద్వారా గాలింపు ముమ్మరం చేశారు&period; నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో&comma; 40 ఫ్లాట్‌లు ఉన్న అపార్టుమెంట్‌ మొదటి అంతస్థులో పట్టపగలే హత్య జరగడం చూస్తుంటే మృతురాలికి తెలిసిన వారిపనే అయివుంటుందని పోలీసులు అనుమానించారు&period;&period; పోలీసు బృందాలు జల్లెడ పట్టగా వారి అనుమానమే నిజమైంది&period; తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు&period; ఇంటి యజమానికి ఆ ఏరియాలోనే పక్క వీధిలో చిన్న షాపులు ఉన్నాయ్&period;&period; వాటిని అద్దెకు ఇచ్చారు&period; రాము అనే వ్యక్తి బార్బర్‌గా పనిచేసుకుంటానని ఆ షాపును అద్దెకు తీసుకున్నాడు&period;&period; ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న అతను మూడు నెలల నుండి అద్దె చెల్లించలేక పోతున్నాడు&period; ఇదే విషయమై ఓనర్ చాలా సార్లు షాప్ వద్దకు వచ్చి నిలదీయగా అవమానంగా భావించాడు&period; దీంతో కోపం పెంచుకున్నాడు&period;&period; యజమానురాలు బంగారంపై కన్నేశాడు&period;&period; నేరుగా ఇంటికి వెళ్లి అద్దె విషయమై గొడవకు దిగాడు&period; గొంతు నులిమి హత్య చేశాడు&period; అసలే ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతు ఉన్న రాముకి మృతురాలి ఒంటిపై నగలు కనబడడంతో బంగారాన్ని కాజేశాడు&period; నగదు ఉంటుందని భావించి లాకర్‌ తెరవడానికి ప్రయత్నించాడు&period; తాళాలు వేసి ఉండడంతో వీలుపడక దొరికిన బంగారు ఆభరణాలతో పారిపోయాడు&period;<br &sol;>&NewLine;చేతికి చిక్కిన సుమారు 5 తులాల బంగారు ఆభరణాలతో హైదరాబాద్ చెక్కేయడానికి ప్లాన్ వేసాడు&period; ఇక్కడే ఉంటే దొరికిపోతాననే భయంతో రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు&period; రైలు ఎక్కి పారిపోవడానికి సిద్దంగా ఉన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు&period; మూడు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు పోలీసులు&period; దోచుకున్న సొత్తును రికవరీ చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్