సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.

Advertisements

<p>సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది&period; ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది&period; హైకోర్టు ఆదేశాల ప్రకారం&comma; సీఐ నాగరాజును ఒక రోజు మాత్రమే కృష్ణలంకలో విచారించేందుకు అనుమతిస్తూ&comma; మిగిలిన ఏడు రోజుల విచారణను రాజమండ్రి సెంట్రల్ జైలులోనే నిర్వహించాలని పేర్కొంది&period; అలాగే విచారణ మొత్తం ఆడియో&comma; వీడియో రికార్డింగ్‌తో జరగాలని ఆదేశించింది&period; అయితే ఈ పరిమితుల వల్ల కేసుకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలికితీయడం కష్టమవుతోందని సిట్ వాదిస్తోంది&period; అందువల్ల సమగ్ర దర్యాప్తు కోసం హైకోర్టు విధించిన షరతులను సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది&period; ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు&period; కాగా&comma; సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలతో స్టేటస్‌ రిపోర్ట్‌ను సీల్డ్‌ కవర్‌లో తమకు ఇవ్వాలంటూ బుధవారం రోజు సిట్‌ను ఆదేశించింది హైకోర్టు&period;&period; ఈ కేసులో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.