94
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టైలర్ హైస్కూల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు శ్రీమతి సరోజినీ దేవి దంపతుల చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్రాంత మరియు ప్రస్తుత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ గ్రేహన్స్ ఎస్పి విద్యాసాగర్ నాయుడు, కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడులు విచ్చేసి మాట్లాడుతూ చదువులు నేర్పిన గురువులు దేవుళ్ళతో సమానమని అటువంటి ఉపాధ్యాయులను గౌరవించడం అభినందనీయమన్నారు. అనంతరం సివిఆర్ న్యూస్ క్యాలెండర్ ని టిడిపి నాయకులు కొవ్వలి నాయుడు, ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి రంగనాద్ చేతులమీదుగా విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గ్రహండ్స్ ఎస్పీ ఆవిష్కరించారు.