మిచాంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో అరటిపంట ధ్వంసమైంది. నేతివారిపల్లి, నగరిపాడు పరిధిలో 25 వేల అరటిచెట్లు నేలకూలాయి. గూడూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యుత్, టెలికామ్ సేవలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరడంతో 12 గేట్లను ఎత్తి 10000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. గూడూరు, చవటిపాలెం, పురిటిపాలెం, విందురు, చిల్లకూర్లను వరద నీరు చుట్టుముట్టింది. నీళ్లు,ఆహారం కోసం గిరిజన గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Read Also..
Read Also..