కూలీ అవతారమెత్తిన దయానంద్…

Matta Ragamayee Dayanand

Advertisements

&NewLine;<p>సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ పలుగు పట్టి తవ్వి… మట్టి తట్టలు ఎత్తి… కాసేపు ఉపాధి హామీ కూలీ అవతారమెత్తారు&period; ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే స్వయంగా మట్టి పనులు చేశారు&period; ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కలుసుకున్నారు&period; ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వారికి కల్పించాల్సిన వసతులు&comma; సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వాన్ని మళ్లీ కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని కోరారు&period; ఉపాధి హామీ పనుల్లో రోజువారి కనీస కూలీ 400 రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు&period; ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు గ్యారంటీలు విజయవంతంగా ప్రజలకు అందుతున్నాయని&comma; మిగిలిన రెండు పథకాలు కూడా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమలు చేస్తామని ఎమ్మెల్యే రాగమయి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..