80
విజయనగరం ఏజెన్సీలో మరణ మృదంగం మోగుతోంది. శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని చిట్టంపాడులో పక్షంరోజుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రవీణ్ అనే చిన్నారి అనారోగ్యానికి గురైతే విజయనగరం ఘోషా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నారి మరణంతో చిట్టంపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవలే ఇదే గ్రామానికి చెందిన తల్లి గంగమ్మ, ఆరు నెలల బాబు ప్రాణాలు కోల్పోయారు. సకాలంలో వైద్యం అందకనే చనిపోయారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తమ గ్రామానికి వైద్యులు రారని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు చెబుతున్నారు. కలెక్టర్ కూడా పట్టించుకోరని ఆరోపించారు.