80
సీఎం జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం హర్షణీయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని, రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్ మాత్రమేనని అన్నారు. కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. పదవులు ఇంకా పెరుగుతాయన్నారు. బీసీల నాయకత్వం జగన్ హయాంలో బాగా పెరిగిందని చెప్పారు. కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారన్నారు. బస్సుయాత్రలకు జనం నుండి విశేష స్పందన లభిస్తోంది. బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న సహాయం మరువలేనిది అంటూ కృష్ణయ్య కొనియాడారు.