తొలి రోజు అయోధ్య కు పోటెత్తిన భక్తులు

Devotees flocked to Ayodhya on the first day

Advertisements

&NewLine;<p>అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు&period; పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు&period; కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు&period; తొలి రోజు రామ్‌లల్లా దర్శించుకోవడానికి ఆసక్తిని కనబరిచారు&period; ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త జనసందోహం కిటకిటలాడింది&period; దర్శనం కోసం వచ్చిన భక్తులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు&period; చిన్నపాటి తోపులాటలు కూడా జరిగాయి&period; తొలి రోజు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి&period; సాధారణ భక్తులకు నేటి నుంచి దర్శనభాగ్యం కల్పించడంతో పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు&period; భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు&period; మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని తెలిపారు&period; ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చు&period; ఉదయం 6&colon;30 గంటలకు&comma; రాత్రి 7&colon;30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు&period; ఇక భక్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం&comma; హారతి పాస్‌లను పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.