మాఘ పౌర్ణమి (Magha Pournami):
మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హంసలదీవి గ్రామ సమీపంలోని కృష్ణ సాగర సంఘమం, సముద్ర తీరాల వద్దకు వేకువజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి పోటెత్తిన భక్తజన సందోహం. ఆచరించడానికి రాష్ట్ర నలుమూల నంచే కాకుండా, దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సముద్రానికి సూర్య నమస్కారాలు చేసి పుణ్య స్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకున్నారు. సుమారు లక్ష మంది పైగా భక్తులు తరలి రావటంతో అధికారులు ముందస్తుగానే అవసరమైన ఏర్పాట్లను చేశారు. సముద్ర తీరం, వద్దకు వెళ్ళడానికి సింగల్ రహదారి కావడంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
సాగర సంగమం వద్ద గతంలో అధిక ప్రమాదాలు జరగటంతో, ముందుస్తుగా ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు తాసిల్దార్, ఎంపీడీవో గ్రామపంచాయతీ ఈవో యలవర్తి సుబ్రమణ్యం పర్యవేక్షణలో జల్లులు స్నానాలను ఏర్పాటు చేశారు. అవనిగడ్డ డిఎస్పి రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో సిఐ త్రినాథ్ కుమార్ పర్యవేక్షణలో సుమారు 400 మందికి పైగా పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా తను వంతు కృషి చేశారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు భక్తులకు అవసరమైన సూచన సలహాలను ఇస్తున్నారు. హంసలదీవి గ్రామంలోని కొలువైన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారిని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కలను తీర్చుకున్నారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.