సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం

Advertisements

<p>700 ఏళ్లుగా అఖండంగా వెలుగుతున్న దీపం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది&period; రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న ఈ దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు&period; సీనియర్ సినీ నటులు&comma; దర్శకుడు&comma; న్యాయవాది సివిఎల్ నరసింహరావు ఆలయాన్ని కుటుంబ సభ్యులతో సందర్శించి రాములవారికి ప్రత్యేక పూజలు చేశారు&period; మండల కేంద్రంలోని శ్రీ సీతారామాల ఆలయానికి విచ్చేసి&comma; స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు&period; ఈ ఆలయా నికి రావడం తన పూర్వ జన్మ సుకృతమని ఆయన పేర్కొన్నారు&period; 700 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం&comma; నాటి నుండి నేటి వరకు వెలుగుతున్న అఖండ జ్యోతిని దర్శించి పులకించి పోయామన్నారు&period; గత రెండు సంవత్సరాలుగా గంభీరావుపేట రావడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు&period; నేటితో ఆ కోరిక తీరిందని సంతోషం వ్యక్తం చేశారు&period; నవరాత్రుల్లో ప్రజ్వలింప చేసిన జ్యోతిని తొమ్మిది రోజులు కాపాడటమే కష్టమని&comma; అలాంటిది 7 శతాబ్దాలుగా జ్యోతిని కాపాడంలో ఆలయ అర్చకులు&comma; కమిటి సభ్యులు&comma; స్థానిక ప్రజలు చూపుతున్న చొరవను ఆయన అభినందించారు&period; గాలిగోపుర నిర్మాణానికి తన వంతుగా 10వేల రూపాయలు విరాళంగా అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.