కాణిపాక దేవస్థాన పాలకమండలి కీలక నిర్ణయాలు.

Advertisements

<p>చిత్తూరు జిల్లా కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు&comma; 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; దేవస్థానం చైర్మన్ మణి నాయుడు&comma; ఈవో పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ&comma; అభివృద్ధి పనులు&comma; టెండర్లపై విస్తృతంగా చర్చించారు&period; ప్రతి నెల జరిగే సంకష్టహర చతుర్థి బంగారు రథోత్సవ సేవ టికెట్ ధరను రూ&period;5 వేలుగా నిర్ణయిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది&period; అలాగే భక్తులకు మోదక ప్రసాదం అందించే ప్రతిపాదనకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు&period; క్యూ లైన్లు&comma; మాడ వీధుల్లో వేచి ఉండే భక్తులకు తాగునీటి సదుపాయాలు మెరుగుపర్చేందుకు కొత్త సిబ్బంది నియామకానికి అంగీకరించారు&period; బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టనున్న ఇంజినీరింగ్ పనుల టెండర్లకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.