95
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి కేంద్రమైన తుగ్గలి లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అఖిలపక్ష పార్టీ నాయకులు తాళాలు వేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోతే ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడితో ఆగదు అని అఖిలపక్ష పార్టీలతో కలిసి ఆర్డిఓ ఆఫీస్ కూడా తాళాలు వేస్తామన్నారు. అదే విధంగా కలెక్టర్ ఆఫీసు కూడా ముట్టడి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సిపిఎం, సిపిఐ, జనసేన, బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.