లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీ నాయకులు మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ అందరికీ తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మహారాష్ట్రలో కూల్చిన విధంగా.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడం కుదరదని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇన్నాళ్లు బీజేపీని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపారని, అదే తెలంగాణ సంపదను ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ పెద్దలు ఎందుకు జైలుకు పంపడం లేదంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించారని, అయితే, ఆ నియామకాన్ని అందరూ ‘కిషన్ రెడ్డి.. నామినేటెడ్ బై కేసీఆర్’ అన్నారంటూ పొన్నం ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడాలని పొన్న సవాల్ విసిరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.