88
రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని వైకాపా నాయకులు అన్ని రకాలుగా దోచుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని 15 వ వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంను నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మోసపూరిత పథకాలతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వ పెద్దలకు ముందు చూపు లేకపోవడంతో విద్యుత్తు సమస్య నెలకొందన్నారు. తెదేపా అధికారంలోనికి వస్తే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు.