138
పుదుచ్చేరి యానాం నుండి అనధికారికంగా ప్రత్యేకంగా తయారుచేసిన ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించి ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్న ముఠా ను ముమ్మిడివరం పోలీసులు పట్టుకున్నారు. యానాం కు ఆంద్రా ప్రాంతానికి లీటర్ డీజిల్ కు రూ.12 రూపాయలు వరకూ వ్యత్యాసం ఉండటంతో ఈ అక్రమరవాణా చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. యానాం నుండి ఆత్రేయపురం తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం తో ట్రయినీ డిఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లయి అధికారులను రప్పించి వారి సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్యాంకర్ లో సుమారు 3వేల లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం.