అనంతపురం(Anantapur)లోని అతి ప్రాచీనమైన శ్రీరాముడు దేవాలయాల్లో(Sri Rama Temples) ఒకటి శ్రీ కోదండ రాముని దేవాలయం(Sri Kodanda Rama Temple). ఈ దేవాలయం అనంతపురం నగరంలోని పాతూరులో సున్నపు గేర్ల వద్ద కలదు. దాదాపుగా 300 సంవత్సరాల పై చిలుకు క్రితమే నిర్మించబడి ఉన్నదని ఇక్కడే చరిత్ర, పురోహితుల ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయం మొదటగా అనంతపురం నగరానికి చెందిన కోనేటి వంశస్థుల ద్వారా నిర్మించబడినది అని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అయితే మొదటగా ఈ ప్రాంతం పంట పొలాలతో ఉండేదని ఇక్కడ ఒక చెరువు కూడా నిర్మించబడి ఉండాలని ఆ చెరువు కట్ట పైన నిర్మించబడి ఉన్న మొదటిగా ఈ కోదండరాముడు దేవాలయమును ఆ తర్వాత కోనేటి వంశస్థులు దీనిని నిర్మించి అభివృద్ధి చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇంతటి చరిత్ర గల కోదండరాముని దేవాలయమును భక్తులు భక్తిశ్రద్ధలతో నిష్టుతో పూజిస్తూ ఉంటారు. ఇక్కడ దేవాలయంలో శ్రీరామునికి అర్చనలు, భజనలు, కీర్తనలు మరియు ఉట్ల పరస ఘనంగా నిర్వహిస్తారు. ఇంతటి చరిత్ర గల దేవాలయమును దేవాదాయ శాఖ గుర్తించి వీటి నిర్వహణ ఈ శాఖ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో స్థాపితమైన సీతారాముని విగ్రహం , లక్ష్మణుడి విగ్రహం ఎంతో తేజస్సుతో దర్శనమిస్తారు. ఇక్కడ నవగ్రహాల పూజలు చేయడానికి కూడా నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఇక్కడ ఎంతో తేజస్తో దర్శనమిస్తుంది. వేపచెట్టు బోధి వృక్షం రెండూ కలిసి ఇక్కడ వెలిసాయి. ఈ చెట్లకు పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాక శ్రీ కోదండ స్వామికి ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ శ్రీరాముని కొలిచినవారి కోరికలను స్వామివారు తప్పకుండా నెరవేస్తారని ఎంతోమంది భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.
- జగన్ అక్రమాలపై .. తిరుమలలో సిట్ తనిఖీలు ముమ్మరంవైఎస్ జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. తిరుమలలో తనిఖీలు ముమ్మరం చేసింది. శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేపట్టింది. ఆలయంలోని లడ్డూ పోటు, ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు, నెయ్యి నిల్వ కేంద్రాలను…
- రోజురోజుకు మితిమీరిపోతున్న దోపిడీ దొంగల ఆగడాలుహైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. దోమలగూడ లోని అరవింద్ కాలనీలో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి రంజిత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముందుగా కత్తులు, తుపాకులతో ఇంట్లోకి చొరబడిన పది మంది దొంగలు…
- తిరుమలలో పెరిగిపోతున్న రీల్స్ పిచ్చిపవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రను కాపాడడానికి టీటీడీ అధికారులు రోజు రోజుకి ఆంక్షలు విదిస్తూనే ఉంది . కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియా పిచ్చితో తిరుమల పవిత్రతకు ఆటకం కలిగిస్తున్నారు. తిరుమల ఆలయం ముందు వివాదాస్పద వ్యాఖ్యలు,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.