బిజెపికి వ్యతిరేకంగా ఉండే నాయకులపై ఎప్పుడూ కత్తులు వేలాడుతూనే ఉంటాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. చంద్రబాబు కేసులో ముమ్మాటికి రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తుందా, వర్తించదా అనే అంశంపై తీర్పు రావాల్సి ఉన్నా సుప్రీం కోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులలో భిన్నభిప్రాయాలు వెలువడ్డాయని తెలిపారు. బిజెపికి ఎవరైనా అనుకూలంగా ఉన్నారో, వారిపై కేసులు ఉండవన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులపైనే కేసులు ఉంటాయన్నారు. ఈ తరహాలోనే ఈ కేసులో కూడా 17ఏ వర్తించదా, వర్తిస్తుందా అనే అంశం వేలాడుతూనే ఉంటుంది తప్ప.. ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదన్నారు. ఇందులో న్యాయవ్యవస్థ కూడా ఒక రకమైన గేమ్ ను ఆడుతోందని ఆరోపించారు. ఇది ఒక రాజకీయ బెదిరింపు, ఒత్తిడి తప్ప మరొకటి లేదని నారాయణ అభిప్రాయపడ్డారు.
వర్తిస్తుందా…. వర్తించదా
62
previous post