బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి విచ్చేసిన బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి టి కృష్ణ ప్రసాద్ ను, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ, జనసేన పార్టీ సమన్వయ కార్యకర్త నామన వెంకట శివన్నారాయణలు సాదరంగా ఆహ్వానించి పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బాపట్ల పార్లమెంటు అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్,అసెంబ్లీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ. ఈ సందర్భంగా పార్లమెంటు అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…. బాపట్ల కు రావడం పుట్టిన ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది. గుంటూరు జిల్లా ఎస్పీ గా పనిచేసినప్పుడు తరచుగా బాపట్ల వస్తూ ఉండే వాడిని విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నరేంద్ర మోడీ మళ్ళీ దేశంలో అధికారంలోకి వస్తారు, డబుల్ ఇంజన్ సర్కారు తో రాష్ట్రం తో పాటు దేశం అభివృద్ధి చెందుతుంది. డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటే మనమందరం కూటమి కి ఓటు వేసి గెలిపించాలి. బాపట్ల పార్లమెంటు లోని ఏడు అసెంబ్లీ స్థానాలలో మంచి అభ్యర్థులను ఎంపిక చేశారు, వారందరినీ గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి అని కృష్ణ ప్రసాద్ అన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్ తో…
99
previous post