టెంపుల్ టౌన్ తిరుపతిలో ఎన్నికల కోడ్ రాక ముందే ఎలక్షన్ హీట్ మొదలైంది. అధికార పార్టీ వైసీపీ ఒక అడుగు ముందుకేసి పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ పేరును తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో వైసిపి నాయకులు మంచి జోష్ లో ఉన్నారు. నేడు దశమి మంచి రోజు కావడంతో శ్రీవారి పాదాలు అలిపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి అధికార పార్టీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసే శక్తిని ఆ దేవదేవుడు శ్రీవారు భూమన అభినయ్ రెడ్డికి కల్పించాలని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తిరుపతి ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించాలని శ్రీవారినీ కోరుకున్నట్లు తెలిపారు.
తిరుపతిలో మొదలైన ఎన్నికల ప్రచారం…
79
previous post