తెలంగాణలో ఎన్నికల ఉత్కంఠ..

election excitement

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి&period; తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు సరికొత్త ట్రెండ్ సృష్టించారు&period; ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు&period; ఎందుకిలా చేశారో&period;&period; ఎవరికీ అర్థం కాలేదు&period; తమ సత్తా చూపించుకోవడానికో&period;&period; లేదంటే ట్రెండ్ క్రియేట్ చేయడానికో తెలియదు గానీ&period;&period; రెండేసి స్థానాల్లో పోటీలో నిలబడ్డారు&period; ఇంతకీ వారెవ్వరో ఈ పాటికే అర్థమైపోయింటుంది&period; ఒకరు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్&comma; మరొకరు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి&comma; ఇంకొకరు బీజేపీ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్&period; ఈ ముగ్గురూ రెండేసి స్థానాల్లో బరిలోకి దిగి ప్రత్యేకతను చూపించారు&period; ఇక ఎన్నికల షెడ్యూల్ రాక ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సీఎం కేసీఆర్ సవాళ్లు విసిరారు&period; మరోవైపు&period;&period; ప్రస్తుతం ఉన్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు కీలక ప్రకటనే చేశారు&period; ఈ ప్రకటనతో విపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి&period; ఓటమి భయంతోనే కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారని విమర్శించాయి&period; అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ కూడా బీఆర్ఎస్‌కు ధీటుగా ఎత్తుకు పైఎత్తు వేసి కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించేందుకు హస్తం పార్టీ తరపున రేవంత్‌రెడ్డిని కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దింపింది&period; ఇక్కడ కేసీఆర్‌కు రేవంత్ గట్టి పోటీ ఇచ్చారు&period; కామారెడ్డిలో కాంగ్రెస్‌కు మంచి ఓటు బ్యాంక్ ఉంది&period; పైగా సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు&period; అంతేకాకుండా 1983లో టీడీపీ స్థాపించన దగ్గర నుంచీ&period;&period; కామారెడ్డిలో టీడీపీ&comma; కాంగ్రెస్ పార్టీలే గెలుచుకుంటూ వచ్చాయి&period; ఈసారి తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ ఓట్లన్నీ హస్తం పార్టీకి డైవర్ట్ అయినట్టుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి&period; ఇవన్నీ కూడా రేవంత్‌కు బాగానే కలిసొచ్చాయి&period; దీనికి తోడు కామారెడ్డిలో రేవంత్ గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట&period; ఇప్పటికే కామారెడ్డిలో కేసీఆర్&comma; రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయి బీజేపీ తరఫున పోటీచేసిన వెంకట రమణారెడ్డి పక్కాగా గెలుస్తారని సర్వేలు తేల్చేశాయి&period; ఇక తామేమీ తక్కువ కాదంటూ బీజేపీ కూడా ఈటల రాజేందర్‌ను రెండు చోట్ల బరిలోకి దింపింది&period; ప్రస్తుత నియోజకవర్గం హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీలో నిలబెట్టింది&period; ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది&period; ఈటల కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడతాయని కమలం పార్టీ ధీమాగా ఉంది&period; అటు నేచురల్‌గా బీజేపీకి వచ్చే ఓట్లు కాకుండా ముదిరాజ్ ఓట్లు కూడా తోడైతే ఈటల సునాయసంగా గెలుస్తారని పువ్వు పార్టీ అంచనా వేసింది కానీ ఫలితం ఎలా ఉంటుందనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి&period; అటు కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి&period;&period; ఇటు గజ్వేల్‌లో ఈటల రాజేందర్&period;&period; ఇలా రెండు చోట్ల సీఎం కేసీఆర్‌కు గట్టి సవాల్‌ను విసిరారు&period; గజ్వేల్‌లో ఎలాగున్నా&period;&period; కామారెడ్డిలో మాత్రం కేసీఆర్‌కు ఓటమి తప్పదని సర్వేలు అంచనా వేస్తున్నాయి&period; అదే జరిగితే కేసీఆర్ హిస్టరీలో ఇదే బిగ్ షాకే&period; ఇక ఈ ముగ్గురిలో రెండు చోట్ల గెలిస్తే మాత్రం&period;&period; ఒకదానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది&period; అనంతరం 6 నెలల్లో ఏదొక నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం&period; మరీ… ఓటర్లు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారో&period;&period; తేలిపోనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్